“ఎ చై శ” ల మేలుకొలుపే ‘అన్నింటికీ పరిష్కారం’. (Telugu)


అన్నింటికీ పరిష్కారం అనే ఈ పుస్తకంలో వివరించబడిన ఈ ఎక్సరసైజ్, ఒక వ్యక్తి తన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని బాహ్య ప్రపంచం నుండి కాకుండా, తన అంతరంగములో నిక్షిప్తమైవున్న పోటెన్షియల్ ను పెంపొందించు కొని స్వీయ పరిష్కారాన్ని కనుగొనే అభ్యాస ప్రక్రియ.

మన నిజమైన లక్షణాలతో మమేకమై నివసించడం ద్వారా మీరు కోరుకున్న జీవితాన్ని సుఖమయముగా నివసించగలిగే అంశాలనన్నింటినీ పొందవచ్చు  . డాక్టర్ సేగు క్రిష్ణ రమేష్ గారు, వివరించిన ఈ పద్దతి మనకున్న సాంఘిక ఆచారాలు, సంప్రదాయాలు అనే ఒక ముసుగులో నించి మనల్ని బయటకు తీసుకువచ్చి ,  స్వయముగా మీ అసలైన జీవితాన్ని      ఆస్వాదించే విధముగా వున్నది.

         ఈ ‘ఎ చై శ’ (ఎరుక, చైతన్య  ము, శక్తి ) ల మేలుకొలుపే అనే పుస్తకం ద్వారా, డాక్టర్ రమేష్, వారి స్వీయ అనుభవాలను మరియు వ్యక్తిగతముగా తాను సాధించిన ఫలితాలను విశదీకరించారు. మనమందరం, మన జీవితంలో సాధించవలసిన ఏదేని ఒక విషయాన్ని , వ్యక్తపరచి, వృద్ధిచేసు కొని, సార్ధకం చేసుకోవాలంటే, స్వీయ అభ్యాస ప్రక్రియ ద్వారా పేర్కొన్న ఈ ఎక్సరసైజ్ ను ప్రతి రోజూ తొమ్మిది నిమిషాల పాటు అభ్యాసం చేయడం వల్ల మన ఎరుక, చైతన్యము మరియు శక్తి లను బలోపేతం చేసుకొని, భౌతిక, మానసిక మరియు అత్మై క దేహాలను సమన్వయం చేసుకొని, మన అంతరంగములో నిక్షిప్తమైవున్న  అనంతమైన జ్ఞానము మరియు పొటెన్షియల్ ద్వారా మన జీవితాన్ని సార్ధకం చేసుకోగలము.

         డాక్టర్ సేగు క్రిష్ణ రమేష్ 36 సంవత్సరాలు ఎముకల శస్త్ర చికిత్సా నిపుణుడిగా శిక్షణ పొంది, వైద్య వృత్తిలో కొనసాగుతూ వుండేవారు. ఆయన వారి కుటుంబముతో దుబాయిలో నివసిస్తున్నారు. వృతి పరంగా వైద్యురాలైన ఆయన భార్యకు కీళ్ళ  వాతం అనే జబ్బు బాధించసాగినది. దానికి పూర్తి వుపశమనం వైద్య  శాస్త్రములోని మందులకు లేదని తెలిసింది. అంతేగాక ఆ మందులు వాడేకొద్దీ శరీరంలో వాని దుష్ఫరిణామాలు వుంటాయనీ తెలుసుకున్నారు. మరియూ అల్లోపతీ వైద్యశాస్త్రము కేవలం ఆ లక్షణాలను వుపశమనంలో వుంచడానికి మాత్రమే పనిచేస్తుంది గానీ ఆ జబ్బు   రావడానికి గల మూల కారణాలను నివారణ చేయలేదు అని తెలుసుకున్నారు.

         ఆ తర్వాత ఇరవై సంవత్సరాల పాటు చేసిన పరిశోధనలూ, జబ్బులకు నివారణా పద్దతులతో బాటు సైన్స్ కి అందని మరెన్నో విషయాలు తెలుసుకొని ఆ జ్ఞాన్నానంతా ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. ఆ జ్ఞానము ద్వారా ‘ఎరుక, చైతన్యము, శక్తి’ మరియూ ప్రకటన చేయడం, వృద్ధి చేసుకొనడం, నెరవేర్చుకొనడం అనే సాంకేతిక శాస్త్రములను ప్రపంచ వ్యాప్తముగా పరిచయము చేశారు. వారు ఆ జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయుటలో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వుంటారు. అంతేగాక వయస్సు మళ్లడంను ఎలా తగ్గించుకోవచ్చు మరియూ యుక్త వయస్సును సైన్స్ పరంగా ఏవిధముగా తిరిగి పొందవచ్చు అనే జ్ఞానాన్ని వివిధ శిక్షణా తరగతుల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు.   

Learn the simplicity on how to self instruct and bring about a balance in all aspects of your life with the Awakening the ACE Series of books.